విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
- విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ జారీ
- జూన్ 1, 2026 నుంచి అధికారికంగా కార్యకలాపాల ప్రారంభం
- దేశంలో 18వ రైల్వే జోన్‌గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ గుర్తింపు
- గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ జోన్ పరిధిలోకి
- ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీని నెరవేర్చిన కేంద్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కల సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (SCoR) జోన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త జోన్ 2026, జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో, భారతీయ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో ఇచ్చిన హామీ మేరకు ఈ జోన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కొత్త జోన్ పరిధిలోకి ప్రస్తుతం ఉన్న గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు వస్తాయి. అదేవిధంగా, ప్రస్తుత వాల్తేరు డివిజన్‌ను విభజించి, దానిలోని కొంత భాగాన్ని విశాఖపట్నం డివిజన్‌గా ఏర్పాటు చేసి కొత్త జోన్లో కలుపుతారు. మిగిలిన భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేసి, దానిని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) పరిధిలో ఉంచుతారు.
ఇటీవల ఏప్రిల్ 28న విశాఖపట్నంలో పర్యటించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, జూన్ 1వ తేదీ నుంచి జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనకు అనుగుణంగానే తాజాగా కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే పరిపాలన, కార్యకలాపాలు మరింత మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.